కామారెడ్డి టౌన్ : పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ గెలుపొందడంతో సోమవారం బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, ఈ ఫలితాలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


