‘బాధితులకు అండగా ఉంటాం’ | - | Sakshi
Sakshi News home page

‘బాధితులకు అండగా ఉంటాం’

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

‘బాధితులకు అండగా ఉంటాం’

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూల, పండ్ల తదితర దుకాణాలను సోమవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన 22 మంది దుకాణదారుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, వీరికి ప్రభుత్వం నుంచి తక్షణమే ఆర్థిక సహాయం అందేలా చూస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున త్వరలోనే ఐరన్‌ షెడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement