కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన కంప్యూటర్లను సోమవారం ఎంపీడీవోలకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో నూతన కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫీల్డ్, టెక్నికల్ సిబ్బంది మస్టర్లు, మేజర్‌మెంట్ బుక్‌లు, బిల్లులు ఆన్‌లోనే పూర్తి చేయాలని సూచించారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలన్నారు. ఆయా పనులకు ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


