భిక్కనూరు: రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని బీజేఆర్ వ్యవసాయకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్రామ్, టీచింగ్ అసోసియేట్ రషీద్‌ఖాన్ అన్నారు. సోమవా రం తిప్పాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకుని సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని సూచించారు. తిప్పాపూర్, మోటాట్‌పల్లి సర్పంచ్‌లు లింగారెడ్డి, భూమయ్య, ఉప సర్పంచ్ జీవన్, తదితరులు పాల్గొన్నారు.


