లింగంపేట(ఎల్లారెడ్డి): ఐలాపూర్‌లో సోమవారం దుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రతీ ఏటా దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీపోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరి కుస్తీ వెండి కడెం బహూకరించినట్లు తెలిపారు. సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ సంజీవులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నిలిచిన వాహనాలు
రాస్తారోకో చేస్తున్న రైతులు


