రక్తదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

రక్తదానం తిప్పాపూర్‌ మాజీ సర్పంచ్‌ మృతి స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పర్ష వెంకటరమణ కుమారులు పర్ష తృషాల్‌, పర్ష మృణల్‌లు అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మూడు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా ని లుస్తున్నారని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. సోమవారం రోడ్డు ప్ర మాద బాధితుడు రవీందర్‌రెడ్డి కోసం ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కాగా సోదరిలిద్దరు రక్తదానం చేశారన్నారు.రక్తదాత తృషాల్‌ను రక్తదాతల సమూహం ప్రతినిధులు జమీల్‌, చంద్రశేఖర్‌, సుధాకర్‌ తదితరులు అభినందించారు.

భిక్కనూరు: తిప్పాపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఏనుగు బాలరాజిరెడ్డి(70) సోమవారం మృతి చెందారు. సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆయనను కారులో కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యలోనే మృతి చెందారు. తిప్పాపూర్‌ సర్పంచ్‌గా బాలరాజిరెడ్డి 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. మంగళవారం గ్రామంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

మద్నూర్‌(జుక్కల్‌): స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ముజీబ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం వద్ద సోమవారం ప్రచార రథాన్ని తహసీల్దార్‌ ప్రారంభించారు. స్వీయ గణనలో ప్రజలంతా పాల్గొని సక్రమంగా జనగణన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వీయ గణనపై సోషల్‌ మీడియా వేదికపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కవ మంది సెల్‌ఫోన్లు వాడుతున్నందున సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. తహసీల్‌ కార్యలయంలో అవగాహన కోసం హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది రవి, ప్రవీణ్‌, అశోక్‌, హుల్లాజీ తదితరులున్నారు.

పెద్దకొడప్‌గల్‌లో..

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): స్వీయ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని తహసీల్దార్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో జన గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోలో మైక్‌ పెట్టించి ప్రచారం చేయించారు. ఆర్‌ఐ అంజయ్య, ఉప సర్పంచ్‌ నాగు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement