బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

లింగంపేట(ఎల్లారెడ్డి): పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నాయకులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. మూడు రాష్ట్రాల విజయ స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్‌, దత్తురాం, రజినీకాంత్‌, నరేష్‌, శివ్వయ్య, తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ : బాన్సువాడలో బీజేపీ నాయకులు స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అరాచక పాలనకు ప్రజలు చమరగీతం పాడుతూ నరేంద్ర మోదీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి స్వాగతం పలికారని అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, చీదరి సాయిలు, శంకర్‌గౌడ్‌, గజ్జల మహేష్‌, పాశం భాస్కర్‌రెడ్డి, మోహాన్‌రెడ్డి, తదితరులున్నారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బీజేపీ విజయం సాధించడంపై సోమవారం నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మాండ్లు, నాయకులు శ్రీనివాస్‌, కొండ మీరాతాయి, శ్రీకాంత్‌, బాలయ్య, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు: బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్‌, పట్టణాధ్యక్షుడు బొందుగుల భాస్కర్‌, లక్ష్మీదేవునిపల్లి సర్పంచ్‌ లింగారెడ్డి, నేతలు నరేందర్‌రెడ్డి, వినయ్‌, సుధాకర్‌రెడ్డి, విలాస్‌రెడ్డి, గందం రాజు, నరేష్‌రెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement