‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు వంట సామగ్రి | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు వంట సామగ్రి

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారు శ్రీరామ్‌ సు భాష్‌,సుజాత దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారుల ఇంటికి కావాల్సిన వంట సామగ్రిని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం ని రుపేదలకు అండగా నిలుస్తోందని, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యే యమని పేర్కొన్నారు. కౌన్సిలర్లు తాటి లావణ్య ప్ర సాద్‌, గడ్డమీది మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద స్థలం పరిశీలన

కామారెడ్డిటౌన్‌: జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్‌ వద్ద అగ్నిప్రమాదానికి గురైన దుకాణదారులను గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఎస్పీ, ఆర్డీవో, రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇది షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలన్నారు. బా ధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చొరవ తీసుకుని త్వరితగతిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. కౌన్సిలర్‌ గడ్డమీది మహేష్‌, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్‌, నాయకులు చాట్ల వంశీ, సలీం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement