చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరి మృతి
బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామానికి చెందిన జెల్ల హన్మాండ్లు (30) ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు భార్య సుమలత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటమునిగి ఊపిరాడక మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారని సీఐ తుల శ్రీధర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తంప్రభుత్వఏరియాఆస్పత్రికి తరలించామన్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఉప్పు సాయిలు(55) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. కుటుంబ కలహాలతో సాయిలు గత నెల 26న తన వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 2న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సాయిలు సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన రాజాహ్మద్ సోమవారం ట్రాక్టర్‌పై నుంచి పడిపోవడంతో కాలువిరిగినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటికి కూల్చివేస్తూ ఆ మట్టిని ట్రాక్టర్ ద్వారా గ్రామశివారులోని ఓ కుంటలోకి తరలిస్తున్నారు. అయితే, ట్రాక్టర్‌పై వెళ్లిన రాజాహ్మద్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


