త్రుటిలో తప్పిన ప్రమాదం
వర్ని: మండలంలోని బడాపహాడ్ అటవీ ప్రాంతంలో మక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం చింతలపేట్‌లోని కొనుగోలు కేంద్రం నుంచి మక్కలను లోడ్ చేసుకొని జాకోరా సొసైటీకి తరలిస్తుండగా బడాపహాడ్ శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి లారీ లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డు పక్కకు లారీని తీసుకువెళ్లడంతో బస్‌పై పడలేదని, బస్సుపై పడి ఉంటే పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందేవారని పేర్కొన్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీలో సుమారు 400 క్వింటాళ్ల వరకు మక్కలు ఉన్నట్లు జాకోర సొసైటీ సీఈవో రామకృష్ణ తెలిపారు.


