స్వచ్ఛందంగా వస్తున్నారు..
నాలుగేళ్ల క్రితం ప్రారంభించాం
బాలబాలికలకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలన్న లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని దొరవారి హనుమాన్ మందిరంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. మొదట్లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ సభ్యులు పిల్లలకు హనుమాన్ చాలీసా, శ్లోకాలు నేర్పించారు. పలువురు చిన్నారులు వాటిని కంఠస్థం చేశారు. ఆ తర్వాత వారే ఇతరులకు నేర్పిస్తున్నారు. వీరిలో ఐదో తరగతి చదువుతున్న అద్విక్, ఎనిమిదో తరగతికి చెందిన రాంచరణ్, యువాన్ ముందున్నారు. వీరు హనుమాన్ చాలీసాను, భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని తోటి పిల్లలకు నేర్పుతున్నారు. అద్విక్ తోటి వారికి నేర్పడమే కాకుండా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హిందూ సమ్మేళనంలాంటి ధార్మిక కార్యక్రమాలలో హనుమాన్ చాలీసాను, భగవద్గీత శ్లోకాలను పఠించి శెభాష్ అనిపించుకున్నాడని అతడి తండ్రి ప్రదీప్ తెలిపారు.
ఇతర కాలనీలలోనూ..
దొరవారి హనుమాన్ మందిరంలో ప్రారంభమైన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడంతో ఇతర కాలనీలతోపాటు చుట్టు పక్కలనున్న సుమారు 30 గ్రామాలకూ విస్తరించింది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న రాంచరణ్ తేజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. సెలవుల్లోనూ ఈ కార్యక్రమం ఆగడం లేదు. సెలవులకు స్వగ్రామానికి వెళ్దామన్నా తమ వాడు రావడం లేదని రాంచరణ్ తేజ్ తండ్రి దుర్గయ్య తెలిపారు. తమ పిల్లలు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తూ చదువుల్లోనూ ప్రతిభ చూపుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలకు శ్లోకాలు, హనుమాన్ చాలీసాను నేర్పడం ద్వారా వారిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాలన్న సంకల్పంతో ఎల్లారెడ్డిలోని గుడిలో ప్రారంభమైన కార్యక్రమం.. నాలుగేళ్లుగా ప్రతి శనివారం నిరంతరాయంగా కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. పిల్లలు శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్చుకుని తోటివారికీ నేర్పుతున్నారు. – ఎల్లారెడ్డి
పట్టణంలో ప్రా రంభించిన హనుమా న్ చాలీసా పారాయణానికి ప్రతి శనివారం బాల బాలికలు స్వ చ్ఛందంగా వస్తున్నా రు. శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నారు. కొందరు పిల్లలు తాము నేర్చుకొని తోటి వారికి నేర్పిస్తున్నారు. రాంచరణ్, అద్వి క్, యువాన్‌లాంటి పిల్లలు చొరవ తీసుకుని తోటి వారికి నేర్పడం అభినందనీయం.
– తులసీదాస్, జిల్లా గోరక్షా ప్రముఖ్
పిల్లలకు శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్పించాలన్న లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం దొరవారి హనుమాన్ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతీ శనివారం నిర్వహిస్తున్నాం. పిల్లలు ఆసక్తితో శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో పట్టణంలోని టీచర్స్ కాలనీ, సిద్దుల రామాలయంతో పాటు సమీపంలోని 30 గ్రామాలలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది.
– వినోద్ కుమార్, జిల్లా సంఘటన మంత్రి,
విశ్వహిందూ పరిషత్
నాలుగేళ్లుగా హనుమాన్ చాలీసా పారాయణం
తోటి పిల్లలకు నేర్పిస్తున్న పలువురు
చుట్టుపక్కల గ్రామాలకు
విస్తరించిన కార్యక్రమం


