కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన మేడుదుల చిన్నరాజయ్య–నర్సమ్మ, కిష్టయ్యల జ్ఞాపకా ర్థం మేడుదుల లక్ష్మి శనివారం వైకుంఠ రథాన్ని విరాళంగా అందజేశారు. రూ.3.10 లక్షల వ్య యంతో రథాన్ని తయారు చేసి ఇవ్వడంతో దా త మేడుదుల లక్ష్మిని టేక్రియాల్ గ్రామస్తులు అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, మేడుదుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: వేసవిలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణను గ్రామ విద్యార్థులు, యువకులు సద్వినియో గం చేసుకోవాలని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ అన్నారు. శనివారం రాత్రి ఆయన బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన్నె అనిల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన వేసవి కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ మన్నె రమేష్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన విద్యార్థులు, యువతీ, యువకులు వేసవి సెలవుల్లో ఎండల్లో తిరగకుండా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే ఆడుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కంప్యూటర్ శిక్షణకు పంపించాలని సూచించారు. ఉప సర్పంచ్ బస్వయ్య, గ్రామపెద్దలు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, రాజేశ్వర్‌గౌడ్ తదితరులున్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): ప్రతి కార్మికుడు జీవిత బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక శాఖాధికారి కమ్రోద్దీన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. కార్మికుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు.
నిజాంసాగర్(జుక్కల్): గ్రామాలు, కుటుంబాల వారీగా జనగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మహమ్మద్‌నగర్ మండల తహసీల్దార్ ఎస్.లత సూచించారు. శనివారం మహమ్మద్ నగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. కుటుంబాల వారీగా వివరాలు సేకరించి రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గిర్దావర్ పండరి, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు గ్రామంలో శనివారం పొచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. రథాల పున్నమి సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీ పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరి కుస్తీ వెండి కడెం బహూకరించినట్లు తెలిపారు. కుస్తీ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సర్పంచ్ తహసీన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.


