రామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, కాంగ్రెస్ నాయకులు, అధికారులు రైతులను పట్టించుకోవడంలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం మోషన్‌పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మోషన్ పూర్ ఉపసర్పంచ్ సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యుడు సత్యరాజ్‌తో కలిసి పరిశీలించారు. వడ్లూరు ఎల్లారెడ్డి సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని, రైతులు కల్లాల్లోనే ఎండలో ఎండుతున్నారని ఆరోపించారు. రైతుల ఆవేదనను సర్కార్ అర్థం చేసుకొని కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కూలీలు లేనిచోట వెంటనే అధికారులు స్పందించి కూలీలను సమకూర్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


