పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేష్‌ చంద్ర అన్నారు. సదాశివనగర్‌, గాంధారి పోలీస్‌ స్టేషన్‌లలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న రామక్రిష్ణయ్య, రవి కుమార్‌లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. వారు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్‌ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్వయంగా వారిద్దరికీ ఏఎస్సై చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో నిజాయితీ, నిబద్ధతతో పని చేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement