రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

Mar 10 2026 12:49 PM | Updated on Mar 10 2026 12:49 PM

రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

రైస్‌ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షడు భూమేష్‌, ప్రతినిదులు మాట్లాడుతూ.. డీఫాల్ట్‌ రైస్‌ మిల్లర్లకు విధించిన 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీలను మాఫీ చేయాలన్నారు. డీఫాల్ట్‌ మిల్లర్లు ప్రభుత్వానికి బాకీ పడిన బియ్యంను 4 వాయిదాలలో తిరిగి ఇచ్చే అవకాశం కల్పించాలన్నారు. మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన మిల్లింగ్‌, రవాణా, డ్రైయింగ్‌ చార్జీలను వెంటనే విడుదల చేయాని కోరారు. ఆయా కారణాలతో మిల్లర్లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement