దోమకొండ: మహిళా సాధికారతతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రమీల పేర్కొన్నారు. సోమవారం గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. వారికి గౌరవం ఇవ్వడమంటే మన సంస్కృతిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలను గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఐసీడీఎస్ సీడీపీవో శోభారాణి, కామారెడ్డి సీడీపీవో పద్మ, అంగన్‌వాడి సూపర్‌వైజర్ ప్రియాంక, ఈజీఎస్ ఏపీవో రజని, ట్రస్ట్ ప్రతినిధులు గణేష్ యాదవ్, వెంకటలక్ష్మి, వినయ్, కల్పన తదితరులు పాల్గొన్నారు.


