పిచ్చికుక్క స్వైర విహారం
దోమకొండ: మండల కేంద్రంలో సోమవారం రాత్రి పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని మటన్ మార్కెట్ నుంచి పాత బీబీపేట రోడ్డుతోపాటు ప్రధాన రహదారిపై ఆరుగురిని కరిచింది. పాత బీబీపేట రోడ్డులో పెద్ది చందు కూతురు వాక్షాయని ఇంటిముందు ఆడుకుంటుండగా దాడి చేసింది. దీంతో తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మటన్ మార్కెట్‌లో యాదమ్మ, స్రవంతితోపాటు మరో ముగ్గు రిపై దాడిచేసి కరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. క్షతగాత్రులను దోమకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడిలో గాయపడిన చిన్నారి వాక్షాయని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. క్షతగాత్రులను దోమకొండ సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌లు పరామర్శించారు. క్షతగాత్రుల బంధువుల దాడిలో కుక్క మృతిచెందింది.


