కామారెడ్డి టౌన్: మహిళలు వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సంస్థ కార్యాలయంలో వర్డ్ ఎన్జీవో సహకారంతో న్యాయ అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణలు ఉన్నాయని, అవసరమైన వారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని సూచించారు. అనంతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, ప్రోటీన్ పౌడర్‌లను పంపిణీ చేశారు. వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు యర్రం చంద్రశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, డీఎల్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


