వృత్తిదారుల సంక్షేమానికి రూ. 25 వేల కోట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తిదారుల సంక్షేమానికి రూ. 25 వేల కోట్లు కేటాయించాలి

Mar 10 2026 12:49 PM | Updated on Mar 10 2026 12:49 PM

వృత్తిదారుల సంక్షేమానికి రూ. 25 వేల కోట్లు కేటాయించాలి కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో చేతివృత్తిదారుల ఉపాధి, సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.25 వేల కోట్లు కేటాయించాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎస్‌.వెంకట్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లు పైబడిన వృత్తిదారులందరికీ నెలకు రూ.4 వేల పెన్షన్‌ అందించాలని కోరారు. బీసీ సబ్‌ ప్లాన్‌ చట్టం చేసి, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. వృత్తిదారులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మత్య్స కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌, నాయకులు పండరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షకు 10,046 మంది విద్యార్థులకుగాను 378 మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. పరీక్షలను జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement