లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో రెండు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని కొండి సంజీవులుకు చెందిన రెండు మేకలు గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లగా విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాయి. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇవ్వగా ఏడీఈ మల్లేశం, లైన్‌మన్ పాండు, సర్పంచ్ ఆకుల సురేందర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నష్టపరిహారం చెల్లించాలని అధికారులను బాధితుడు కోరారు. ఉపసర్పంచ్ సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


