● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 113 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలి లేదా పరిష్కార మార్గాలు చూ పాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
భిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా మంజూరు చేసిన ప్యూజన్ అండ్ జెన్, గ్రానైట్ పరిశ్రమల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పెద్దమల్లారెడ్డి సర్పంచ్ సాయాగౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం వారు ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుతో పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుదన్నారు. కాలుష్యం, తదితర కారణాలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ఎల్లారెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్, డీటీ శ్రీనివాస్ తదితరులున్నారు.


