కామారెడ్డి టౌన్: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అంబులె్‌న్స్ సేవలు అందించినందుకు తాడ్వాయి 108 అంబులెన్స్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన స్వయంగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తాడ్వాయి అంబులెన్స్ సిబ్బంది పైలట్ కార్తీక్, ఈఎంటీ రోహిత్ తమ విధుల్లో అంకితభావం ప్రదర్శించి రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవీందర్ గౌడ్, 108 ప్రొగ్రామ్ ఆఫీసర్ జనార్దన్, జిల్లా మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


