సొంతిల్లు కల నెరవేర్చుకున్న నిరుపేదలు
భిక్కనూరు: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో సొంతిల్లు కలను నిరుపేదలు నెరవేర్చుకున్నారని భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖాసుదర్శన్ అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులు నూతన గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేఖాసుదర్శన్ ఆ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, సారెను బహుకరించారు. ఈవో మహేష్‌గౌడ్, ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, నాయకులు అందె దయాకర్‌రెడ్డి, నర్మల రాంచంద్రం, బత్తుల లక్ష్మీనర్సింలు, ముచ్చర్ల రాంరెడ్డి పాల్గొన్నారు.
బీబీపేట: ఇస్సానగర్ గ్రామానికి చెందిన స్వామిగౌడ్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేయడంతో గురువారం గృహ ప్రవేశం చేశాడు. దీంతో ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యదర్శి నరేందర్‌లు ఉన్నారు.


