పొల్కంపేట గ్రామ కమిటీ ఎన్నిక
లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేట గ్రామ కాంగ్రె స్ పార్టీ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ తెలిపారు.ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆదేశాల మే రకు గ్రామంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాసుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడిగా రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, సహాయ కార్యదర్శిగా సూరంపల్లి యాదగిరి, కోశాధికారిగా తలారి యాదగిరి, కార్యవ ర్గ సభ్యులుగా దేవసోత్ బద్రు, కీసర రాములు, రామణి, గంగయ్య, దుర్గపతిలను ఎన్నుకున్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వంశీకుమార్‌ను ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సక్రూనాయక్, అయ్యపల్లి సర్పంచ్ గోనె లింగం, నాయకులు రఫియోద్దీన్, ఎల్లమయ్య, నగేష్, సాయికుమార్, శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.


