గిరిజన శాఖలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన శాఖలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

Feb 27 2026 7:36 AM | Updated on Feb 27 2026 7:36 AM

గిరిజన శాఖలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

గిరిజన శాఖలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్‌: గిరిజన సంక్షేమ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీపీటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ విక్టర్‌కు వినతిపత్రం అందేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో భాషా పండితులు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్ట్‌ రెసిడెన్స్‌ టీచర్‌లను రెగ్యులరైజ్‌ చేసి ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయడంతో పాటు 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అకడమిక్‌ పర్యవేక్షణకు విద్యా అధికారులను నియమించాలని, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల పోస్టులను మంజూరు చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి గోపు శ్రీనివాస్‌, రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement