పండుగొచ్చింది
ఒకరోజు ముందే..
పల్లె గూటికి
● ఊళ్లకు చేరిన జనం
● ఘనంగా భోగి.. నేడు సంక్రాంతి
పిట్లం అయ్యప్ప ఆలయం ఆవరణలో ముగ్గులు వేస్తున్న మహిళలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సంక్రాంతి అంటేనే సంబురం. పిండివంటల ఘుమఘుమలు.. ముంగిట్లో ముత్యాల ముగ్గులు.. అలరించే గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. ఎటు చూసినా పతంగుల కోలాహలం.. ఈ మూడు రోజులూ పండుగే.. చదువు, ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వ లసవెళ్లినవారు.. పండుగ నేపథ్యంతో ఇప్పటికే సొంతూళ్లకు చేరారు. దీంతో పల్లెకు కళొచ్చింది. బుధవా రం భోగిని ఘనంగా జరుపుకున్న జిల్లావాసులు.. గురువారం సంకాంత్రి, శుక్రవారం కనుమ పండుగలను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. తమ కు టుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ మహిళలు సంక్రాంతి నోములు నోచుకోనున్నారు.
బేగంపూర్ తండాలో ..
మద్నూర్‌లో ముగ్గు వేస్తున్న మహిళ
మద్నూర్: మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్, డోంగ్లీ మండలాల్లో సంక్రాంతి పండుగను ఒక రోజు ముందే జరుపుకుంటారు. ఆయా గ్రామాల్లో బుధవారమే పండుగ చేసుకున్నారు. ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎడ్ల బండ్లపై వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ధాన్యలక్ష్మికి పూజలు చేశారు. పొలాల వద్దే భోజనాలు చేశారు.
పండుగొచ్చింది
పండుగొచ్చింది
పండుగొచ్చింది
పండుగొచ్చింది
పండుగొచ్చింది
పండుగొచ్చింది
పండుగొచ్చింది


