వెల్లివిరియాలి
ప్రతి ఇంటా ఆనందాలు
బాన్సువాడ : ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడలో నిర్వహించిన కై ట్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి పాల్గొని గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిపంటలతో రైతులందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పాత బాన్సువాడ హనుమాన్ ఆలయం వద్దనుంచి పండరీపూర్‌కు పాదయాత్రను ప్రారంభించారు. విఠలేశ్వరుడు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శక్తినివ్వాలని ప్రార్థించారు.


