‘అభివృద్ధిని చేతల్లో చూపిస్తాం’
కామారెడ్డి టౌన్: అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని షబ్బీర్ కాలనీలో రూ. 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీకి కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలను మంజూరు చేయించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అక్రమంగా పట్టాలు పొందిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షబ్బీర్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


