నిజాంసాగర్‌కు చేరిన సింగూరు జలాలు
నిజాంసాగర్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ఈనెల 10 నుంచి విడుదలవుతున్న నీరు బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టును చేరింది. ప్రాజెక్టులోకి 4,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఆయకట్టు అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402 అడుగుల (14.830 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.
భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రోళ్ల మహేశ్ జాతీయ స్థాయి సీనియర్ మాడ్రన్ కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. ఈ మేరకు మాడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కంభం రాంరెడ్డి జారీ చేసిన లేఖ బుధవారం మహేశ్‌కు అందింది. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిలాల్లో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించే పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు.
నిజాంసాగర్: ఇథియోపియా దేశానికి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం బుధవారం నిజాంసాగర్ మండలంలో పర్యటించింది. బృందం సభ్యులు నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, ప్రధాన కాలువనుంచి నీటి పంపిణీ తీరును తెలుసుకున్నారు. నీటిపారుదలశాఖ ఎస్‌ఈ దక్షిణామూర్తి, ఈఈ సోలోమాన్ వారికి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ తూములు, సాగునీరు గురించి వివరించారు.
కామరెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గల డయాలసిస్ సెంటర్‌ను ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నెఫ్రాలాజీ విభాగం వైద్యుల బృందం బుధవారం సందర్శించింది. సెంటర్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారితో మాట్లాడి చికిత్స తీరును తెలుసుకున్నారు. అనంతరం సెంటర్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి, రోగులకు మెరుగైన వైద్యం అందించేలా పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో బృందం సభ్యులు చిరంజీవి, విజేత, ఆస్పత్రి ఆర్‌ఎంవో అజీమ్, డయాలసిస్ క్లస్టర్ మేనేజర్ శ్రీహరి, ఆరోగ్యశ్రీ క్లస్టర్ మేనేజర్ సందీప్, సెంటర్ ఇన్‌చార్జి భరత్, సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
భిక్కనూరు: భిక్కనూరులోని శ్రీసిద్దరామేశ్వరాలయం అర్చకుడు కె.సిద్దేశ్వర స్వామి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆలయ ఈవో శ్రీధర్‌ను బుధవారం ‘సాక్షి’ సంప్రదించగా వివరాలు తెలిపారు. అర్చకుడు సిద్ధేశ్వర స్వామి పుట్టు వెంట్రుకలు తీయడానికి రూ. 500 డిమాండ్ చేశారన్నారు. ఈ విషయమై భక్తులు ఫిర్యాదు ఇచ్చారన్నారు. అలాగే ఉపాలయమైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో వీరశైవ ఆగమం ప్రకారం నిత్యపూజాది కై ంకర్యాలు చేయాలని పలుమర్లు సూచించినా సదరు అర్చకుడు పట్టించుకోవడం లేదన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి విరుద్ధమైన చర్యలకు పాల్పడడం, విధుల్లో నిర్లక్ష్యం వహించినందున దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సూచన మేరకు సిద్దేశ్వర స్వామిపై సస్పెన్షన్ వేటు వేశామని ఈవో తెలిపారు.
నిజాంసాగర్‌కు చేరిన సింగూరు జలాలు
నిజాంసాగర్‌కు చేరిన సింగూరు జలాలు
నిజాంసాగర్‌కు చేరిన సింగూరు జలాలు


