మున్సి‘పోల్స్’ వైపు మరో అడుగు
● బల్దియాలవారీగా రిజర్వేషన్లు ఖరారు
● మిగిలింది వార్డులవారీ
రిజర్వేషన్ల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయా మున్సిపాలిటీల్లో ఏ వర్గానికి ఎన్ని వార్డులు అన్న రిజర్వేషన్ల లెక్క తేల్చారు. ఏ వార్డు ఏ వర్గానికి కేటాయించారన్నది తేలాల్సి ఉంది.
● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 92 వార్డులున్నాయి. ఇందులో మహిళలకు 45 వార్డులు రిజర్వ్ అయ్యాయి.
● ఎస్టీలకు నాలుగు వార్డులు కేటాయించగా.. ఇందులో ఒక్కటి కూడా మహిళలకు రిజర్వ్ కాలేదు. అన్నీ జనరలే ఉన్నాయి.
● ఎస్సీలకు 10 కేటాయించగా.. ఇందులో ఐదు మహిళలు, ఐదు జనరల్‌కు ఉన్నాయి.
● బీసీలకు 31 వార్డులు కేటాయించారు. ఇందులో 14 వార్డులు మహిళలకు, 17 వార్డులు జనరల్ అయ్యాయి.
● అన్‌రిజర్వ్‌డ్ కేటగిరిలో 47 వార్డులుండగా.. ఇందులో మహిళలకు 26 వార్డులు, జనరల్‌కు 21 వార్డులు ఉన్నాయి.


