కల్తీ కల్లుకు కేరాఫ్ దుర్కి
బాన్సువాడ/నస్రుల్లాబాద్ : మత్తెక్కించే కల్లు.. వ్యా పారులకు కాసులు కురిపిస్తుండగా, అమాయకుల ప్రాణాలను తీస్తోంది. కిక్కు కోసం కల్తీ కల్లుకు బానిసవుతున్న పలువురు అనారోగ్యంబారిన పడుతున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ని డిపో కల్తీకల్లుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రూ. 10కి లభించే సీసాలో ఒకరకంగా, రూ.20కి లభించే కల్లు సీసాలో మరో రకమైన మత్తు ఉంటుందంటా రు మందుబాబులు. ఈ మత్తెక్కించే కల్లు కోసం ని త్యం బాన్సువాడ, కొల్లూర్, సోమేశ్వర్, దేశాయిపేట్‌తోపాటు పలు గ్రామాలనుంచి నడుచుకుంటూ కొందరు, మోటార్ సైకిళ్లపై మరికొందరు దుర్కికి వస్తుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు రెండు, మూడు కల్లు ప్యాకెట్లను వెంట తీసుకువెళ్తారు.
పట్టించుకోని అధికారులు
దుర్కి కల్లు డిపో నుంచి సుమారు 7 గ్రామాలకు కల్లు సరఫరా చేస్తారు. డివిజన్‌లో ఎక్కువగా కల్తీకల్లును దుర్కిలోనే అమ్ముతున్నారనే విషయం బహిరంగ రహస్యం. బాన్సువాడకు కూతవేటు దూరంలో ఉన్న దుర్కిలో క్లోరోఫాం, ఇతర మత్తుపదార్థాలు కలుపుతున్నారనే విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొని కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కల్లు సేవించిన పలువురికి అస్వస్థత
బలవుతున్న అమాయకులు
తాజాగా 60 మందికి అస్వస్థత
మెరుగైన చికిత్స కోసం
నిజామాబాద్‌కు 12 మంది తరలింపు
లైసెన్సులు రద్దు చేయండి
కల్తీ కల్లు దుకాణ యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. సోమవారం కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన దుర్కి, అంకోల్, అంకోల్ తండా, దామరంచ గ్రామాలకు చెందిన బాధితులను బాన్సువాడ ఆస్పత్రిలో పరామర్శించారు. కల్లు తాగిన తర్వాతే తాము అస్వస్థతకు గురయ్యామని బా ధితులు చెప్పారు. విచారణ జరిపి కల్లు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్‌రావుకు సబ్‌కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో ఆర్‌ఎంవో అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాత్రి వేళలో సబ్ కలెక్టర్ ఆయా గ్రామాల్లో పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
దుర్కి డిపో నుంచి సోమవారం అంకోల్, దుర్కి, దామరంచ గ్రామాల్లోని దుకాణాలకు కల్లు సరఫరా అయ్యింది. ఆ కల్లు తాగిన పలువురు కళ్లు తేలేయడం, మెడలు పడేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో ఒక్కొక్కరిగా బాధితులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య వెంటనే అంకోల్ గ్రామానికి వెళ్లారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో మాట్లాడారు. స్థానిక గ్రామ పంచాయతీ వద్ద మందులను అందుబాటులో ఉంచి, ప్రథ మ చికిత్స అనంతరం బాధితులను అంబులెన్సులో బాన్సువాడకు పంపించాలని సూచించారు. సోమవారం రాత్రి వరకు బాధితుల సంఖ్య 60 కు చేరింది. ఇందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించారు. బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ పరామర్శించారు. పలువురు బాధితులకు ఆర్థిక సాయం అందించారు.
నివేదిక పంపిస్తున్నాం
అంకోల్ గ్రామ కల్లు దుకాణంపై విచారణ చేపట్టాం. కల్లును పరీక్షించగా సీహెచ్ శాతం లేదు. మరేదైనా మత్తు పదార్థం ఉందేమో అన్న అనుమానంతో శాంపిల్స్ సేకరిస్తున్నాం. కౌంటర్ నెం.5 నాగరాజు గౌడ్ దుకాణంపై చర్యలు తీసుకుంటాం. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం.
– యాదిరెడ్డి, బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ
వివరాలు సేకరించాం
కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన వారి వివరాలు సేకరించాం. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అంకోల్, అంకోల్ తండాకు చెందిన బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం.
– సాయిలు, ఆర్‌ఐ, నస్రుల్లాబాద్
కల్తీ కల్లుకు కేరాఫ్ దుర్కి
కల్తీ కల్లుకు కేరాఫ్ దుర్కి


