సలాబత్‌పూర్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
మద్నూర్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయంగా స లాబత్‌పూర్ హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారా వు పేర్కొన్నారు. సలాబత్‌పూర్ హనుమాన్ ఆ లయ అభివృద్ధికి రూ. 70 కోట్లు మంజూర య్యాయన్నారు. సలాబత్‌పూర్ హనుమాన్ ఆ లయంలో ఆదివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నూతన చైర్మన్ రాంపటేల్, స భ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ –మహారాష్ట్ర –కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రసిద్ధిచెందిన హనుమాన్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతర్రాష్ట్ర లెండి ప్రా జెక్ట్ పనుల కోసం బడ్జెట్‌లో రూ. 50 కోట్ల వర కు నిధులు మంజూరు చేశామన్నారు. అనంత రం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను స న్మానించారు. కార్యక్రమంలో ఆలయ అధికా రులు, నాయకులు పాల్గొన్నారు.
రూ. 70 కోట్లు మంజూరయ్యాయి
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు


