వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
కామారెడ్డి టౌన్/తాడ్వాయి : ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులకు నిర్వహించిన వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి ఉన్నత పాఠశాలలో జిల్లాలో పదోన్నతి పొందిన భాష ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యాక్రమానికి హాజరయ్యారు. భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల నిర్వహణ, బోధన పద్ధతులు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ జిల్లా సమన్వయ కర్త వేణుగోపాల్, డీసీఈబీ కార్యదర్శి లింగం, ఎంఈవో రామస్వామి, నోడల్ అధికారులు శ్రీ నాథ్, సాయిరెడ్డి, రిసోర్స్ పర్సన్ వెంకట రమణ, వెంకటేశం, విజయ్ కుమార్, లోకేశ్వర్ రావు, పవన్ కుమార్, ప్రసాద్, బసంత్ రాజు, కృష్ణ, శ్రీశైలం,రమేష్ , ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలి
డీఈవో రాజు


