సన్న బియ్యం.. నూకలే అధికం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 578 రేషన్ దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల పరిధిలో ప్రతినెలా 2,53,303 కుటుంబాలకు 5,571 మెట్రి క్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గత నెల వరకు దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి. ఈనెలనుంచి సన్నబియ్యం పంపిణీ చే యాలని సర్కారు నిర్ణయించి, ఇప్పటికే జిల్లాలోని ఆయా స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యాన్ని పంపించింది. ఇంకా కొన్ని దుకా ణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం అన్ని గ్రామాలు, పట్టణాల్లో అధికార పార్టీ నేతలు దగ్గరుండి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
నాణ్యత తక్కువ..
రేషన్ షాప్‌ల ద్వారా సరఫరా చేస్తున్న సన్న బి య్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైనవి ఇస్తే బా గుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొ న్ని రేషన్ దుకాణాలకు నూకలు తక్కువగా ఉన్న బి య్యం సరఫరా అవగా, చాలా దుకాణాలకు సరఫ రా అయిన బియ్యంలో నూక 20 శాతానికి మించి ఉ న్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో ఏ ర కం బియ్యం కొనుగోలు చేసినా నూకలు కనిపించ వు. రేషన్ బియ్యంలో కూడా నూకలు తక్కువగా ఉండేవి. సన్న బియ్యం వచ్చేసరికి నూకల శాతం పె రగడంతో లబ్ధిదారులు కొంత ఇబ్బంది పడుతున్నా రు.
వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం కావడంతో వండితే అన్నం మెత్తగా అవుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇక నుంచి ప్రతినెలా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో నా ణ్యతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
రేషన్ బియ్యంలో నూకలు
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్‌ల ద్వారా సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టింది. సన్న బియ్యం అనేసరికి లబ్ధిదారులు మొదటి రోజునే రేషన్ దుకాణాలకు తరలివచ్చారు. అయితే 20 శాతానికిపైగా నూకలు ఉండడం, దానికితోడు వండితే అన్నం ముద్దగా అవుతుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ఇరవై శాతానికి పైగానే నూకలు
వండితే ముద్దగా మారుతున్న అన్నం
పెదవి విరుస్తున్న లబ్ధిదారులు


