అలరించిన కుస్తీ పోటీలు
నిజాంసాగర్/ఎల్లారెడ్డిరూరల్ : మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. నల్లపోచమ్మ, ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వహకులు నగదును బహుమానంగా అందజేశారు. కార్యక్రమంలో కుస్తీపోటీల నిర్వహకులు గంగారెడ్డి, నాగభూషణం గౌడ్, సాదులసత్యనారాయణ, పోతాగౌడ్, సిద్దు ఉన్నారు.
నేడు కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు
బాన్సువాడ రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి 5తులాల వెండి కడియం,ద్వితియ బహుమతి 3తులాల వెండికడియం, తృతియ బహుమతి 2తులాల వెండికడియం బహుకరించనున్నారు.
అలరించిన కుస్తీ పోటీలు


