సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో గురువారం మండల సమాఖ్య సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రాజిరెడ్డి మాట్లాడుతూ...అన్ని గ్రామాల్లో గ్రామ సంఘాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం గ్రామ అధ్యక్షులపై ఉందన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. అలాగే ధర్మారావ్‌పేట్, అమర్లబండ గ్రామాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా నిర్వహించడానికి కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శోభ, సీసీలు రాములు, లింగం, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘ సభ్యులకు టైలరింగ్‌పై శిక్షణ
రాజంపేట: మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మహిళా సంఘ సభ్యులకు టైలరింగ్ , స్టిచ్చింగ్, కటింగ్‌లపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీఎం సాయిలు తెలిపారు. రాజంపేట మహిళా సంఘ సభ్యులు పద్మ, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు లక్ష్మి, సీసీలు, వివిధ గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
పంచాయతీ సెక్రెటరీల నూతన కార్యవర్గం ఎన్నిక
రాజంపేట : రాజంపేట మండల పంచాయతీ సెక్రెటరీల నూతన కార్యకవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సీహెచ్. రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జి.స్వాతి, జనరల్ సెక్రెటరీగా టి. వంశీ, కోశాధికారిగా జె. వసంతలు ఎన్నికయ్యారు.


