నిజాంసాగర్(జుక్కల్): మండంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్, నిజాంసాగర్ నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ ప్రాంగణం పశువుల పాకను తలపిస్తోంది. గెస్ట్ హౌస్, ఇరిగేషన్ కార్యాలయాలు పక్క, పక్కనే ఉన్నాయి. సదరు కార్యాలయాల ఆవరణలో ఉన్న చెట్ల కింద పశువులను కట్టేస్తూ పెంటకుప్పలు వేస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన గేటుతో పాటు గెస్ట్ హౌస్‌కు వెళ్లే ప్రధాన గేటు, అచ్చంపేటకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అధికారుల ఊదాసీనతను చూసి అటువైపు వెళ్లే వారు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
పశువుల పాకనా... ఇరిగేషన్ కార్యాలయమా..?