వర్ని: మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు వర్ని ఎస్సై మహేష్ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒక టీ పాయింట్ వద్ద చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలకు చెందిన 20మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. అలాగే వర్నిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
20మందిపై కేసు నమోదు