ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో బుధవారం లూయిస్ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ అంధులకోసం ప్రత్యేక లిపిని తయారు చేసి ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన వ్యక్తి బ్రెయిలీ అని కొనియాడారు. జిల్లాలో లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీడబ్ల్యూవోను అదేశించారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి నాగరాణి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు హరిసింగ్, కుమ్మరి సాయిలు, బల్‌రాజ్ గౌడ్, శివాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


