అమలాపురం టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యాన బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీ విద్యార్థి తాడి సాయి వెంకటేష్ 7/7 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి, చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నాడు. తమ అకాడమీ నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ప్రిన్సిపాల్ టి.వెంకట సురేష్ తెలిపారు. కుడుపూడి తేజస్ 4, తామర ప్రసన్న 5 స్థానాలు సాధించారన్నారు. వివిధ వయస్సుల కేటగిరీల్లో పనిశెట్టి ధరణి, వంటెద్దు లక్ష్మీ శరణ్య, ఎం.లగీమా, కారుపర్తి కార్తికేయ, పిడుగు ప్రణీల్, అల్లకం ప్రమోద్ ప్రథమ స్థానాలు సాధించారని వివరించారు. విజేతలను పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.


