కాకినాడ రూరల్: కాకినాడ జేఎన్‌టీయూ – కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మధ్య గురువారం సాంకేతిక అవగాహన ఒప్పందం కుదిరింది. మన దేశ యువతకు, పరిశ్రమలకు కావలసిన అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి, నైపుణ్యాల కొరతను తగ్గించేందుకు సాంకేతిక శిక్షణ ఎంతగానో అవసరమని జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ చెప్పారు. స్థానిక కోరమాండల్ సంస్థను సందర్శించిన ఆయన, సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా యువతకు పారిశ్రామిక అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒప్పందంపై జేఎన్‌టీయూకే తరఫున రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, కోరమాండల్ తరఫున యూనిట్ హెడ్ కె.జగన్నాథం సంతకాలు చేశారు. అనంతరం 109 మంది విద్యార్థులకు సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.


