అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలో ఉన్న జూరాల ఆయకట్టు రైతులు రామన్‌పాడు వరకు ఉన్న ప్రధాన ఎడమకాల్వ నుంచి సాగునీరు పొందుతారు. ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో వానాకాలంలో సైతం వారాబందీ విధానంతో ఆయకట్టుకు సాగునీరు వదిలారు. అయితే ఆత్మకూర్ మండలంలోని కట్టకింది పల్లెలకు డీ–6 పిల్ల కాల్వ ద్వారా నీరు పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదు. ప్రస్తుతం ఇరు మండలాల్లో 250 ఎకరాలకుపైగా వరిపంటలు చివరితడి నీరందాల్సి ఉంది. తమ పరిస్థితిని అర్థం చేసుకొని అధికారులు సాగునీటిని వదలాలని రైతులు వేడుకుంటున్నారు.


