గడువులోగా పూర్తయ్యేనా?! | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పూర్తయ్యేనా?!

Nov 25 2026 1:07 AM | Updated on Nov 25 2026 1:07 AM

సర్వే పక్కాగా..

జిల్లాలో నత్తనడకన భూ రీ సర్వే

రైతుల ఎదురుచూపులు..

● పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద

70 గ్రామాల ఎంపిక

● తొలివిడత 17 గ్రామాల సర్వేకు నెలాఖరుతో ముగియనున్న గడువు

● ఇప్పటి వరకు మూడు

పంచాయతీల్లోనే ప్రక్రియ పూర్తి

● పూర్తిస్థాయిలో దృష్టిసారించని

ఉన్నతాధికారులు

గ్రామాల్లోని పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములను రక్షించేందుకు పక్కాగా పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిలో భాగంగా భూ సర్వే చేపట్టింది. భూములకు నిర్దిష్టమైన కొలతలు, హద్దులు నిర్ణయించి, భూదార్‌ కార్డులు ఇస్తాం. మొదటి విడతలో ప్రభుత్వ భూమి రోడ్డు, కుంటలు, చెరువులు, గ్రామకంఠం, రెండో విడతల్లో పట్టాదారుల భూములు సర్వే చేస్తున్నాం. సర్వేకు రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పూర్తిచేస్తాం.

– నూకరాజు, ఏడీ ల్యాండ్‌ సర్వే

ఉండవెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూదార్‌ కార్డుల పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్ని గ్రామాల్లో సర్వేకు చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. తొలివిడత ఎంపిక చేసిన 17 గ్రామాల్లో ఇప్పటి వరకు 3 గ్రామాల్లోనే సర్వే పూర్తవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా నక్షలున్న గ్రామాలతో కలిపి మొత్తం 70 గ్రామాలను సర్వే కోసం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. తొలి విడతగా ఎంపిక చేసిన 17 గ్రామాల్లో ఇప్పటి వరకు 3 గ్రామాల్లో (3,200 ఎకరాల విస్తీర్ణంలో) సర్వే పూర్తి చేశారు. మరో 16 వేల ఎకరాల్లో సర్వే జరుగుతుంది. సుమారు 26 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

ముగ్గురు మాత్రమే సర్వేయర్లు..

జిల్లాలో 70 గ్రామాలకు సంబందించిన సర్వేను పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ముగ్గురు మాత్రమే సర్వేయర్లు ఉండగా.. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు 26 మంది ఉన్నారు. గ్రామ నక్ష ప్లాన్‌ లేని చోట్ల కూడా సర్వే జరుపుతున్నారు. మానవపాడు మండలంలో 2 గ్రామాల్లో, ఉండవెల్లి మండలంలోని డి.బూడిదపాడు శివారులో సర్వే పూర్తిచేశారు. ఇంకా 14 గ్రామాల్లో సర్వే సాగుతూ ఆగుతుంది.

– జిల్లాలోని 13 మండలాలకు పైలెట్‌ గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతి మండలానికి చిన్న శివారులైన 6 గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామానికి 800 నుంచి 1,600 వరకు ఉన్న వాటిని పైలెట్‌ గ్రామాలుగా ఎంపికచేసి వాటిలో సర్వే పూర్తి చేయాలని జీపీఓలు, సర్వేయర్లకు ఆర్డర్లు జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు ఎన్ని పూర్తవుతాయోనని లెక్క లేవని రైతులు వాపోతున్నారు.

గతంలో పంట పొలాల్లో అనేక రకాల విధంగా పేద రైతుల భూములపై వీఆర్‌ఓలు వారికి అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఎక్కించారు. మరికొన్ని శివారులో కాల్వలు ఉన్నవాటిని గతంలో తొలగించి అప్పటి డాక్యుమెంట్లలో ఎక్కించి రైతులకు లేకుండా నష్టం చవిచూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్వలో ఉన్న పంట కుంటలను తొలగించి అవార్డు కాపీలు లేకుండా అధికారులే అక్కడికి.. ఇక్కడికి వెళ్లండని చుట్టూ తిప్పుతున్నారు. భూ రీ సర్వే జరిగితే రైతుల కొలతలు సమన్వయంగా వస్తాయి. పాత రికార్డులలో ఉన్న సమస్యలు సామరస్యంగా వైదొలుగుతుంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement