సాగునీటి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ బోర్లతోనే పంటలు పండిచుకుంటున్నారు. వర్షాలు వస్తేనే బోర్లలో నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాలు లేకపోతే బోర్లు ఎండిపోతాయి. ప్రభుత్వం గట్టు ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– గోలానాయక్, రైతు, మల్లాపురం తండా
వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం
ఆగిపోయిన గట్టు ఎత్తిపోతల పథకం పనులను మళ్లీ ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలి. ఎత్తిపోతల పథకంతో సాగునీటిని ఇక్కడి బీడు భూములకు పారించాలి. ఆ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.
– కావలి నర్సింహులు, రైతు రాయాపురం
కేబినెట్ ఆమోదించాల్సి ఉంది..
గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అంచనాలను తయారుచేసి పంపడం జరిగింది. ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని రూపొందించిన డీపీఆర్ రాష్ట్ర కేబినేట్ ముందు ఉంది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– రహిమొద్దీన్, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ
●


