తగ్గుముఖం
గర్భిణుల నమోదు నుంచే ప్రత్యేకంగా పర్యవేక్షణ
మాతాశిశు
మరణాలు
అందుబాటులో
102 వాహనాలు
మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను ఇంటికి చేర్చే వరకు వైద్య, ఆరోగ్య శాఖ నిత్యం పర్యవేక్షిస్తుంది. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వారిని ఆస్పత్రులకు ప్రతినెలా తీసుకువచ్చి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించి రక్తహీనతను అధిగమించేందుకు మందులు ఇప్పించడం, పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 102 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లీబిడ్డను ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరుస్తున్నారు. నిరంతర పర్యవేక్షణతో జిల్లాలో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గిందని వైద్యాధికారులు చెబుతున్నారు.
వాట్సప్ గ్రూప్‌లలో వివరాలు..
జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అత్యవసర చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి సిబ్బంది రెఫర్ చేస్తున్నారు. రెఫర్ చేసిన వెంటనే ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌కు వాట్సప్ గ్రూప్‌లో గర్భిణి వివరాలు, వారు పడుతున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను తెలియజేస్తున్నారు. దీంతో గైనిక్ హెచ్‌ఓడీ, చిన్నపిల్లల విభాగం సిబ్బంది వెంటనే అప్రమత్తం అవుతారు. రోగి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. రెఫర్ చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదికగా అందిస్తున్నారు.
గద్వాల క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మాతాశిశు మరణాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టింది. జిల్లావ్యాప్తంగా గతంలో ప్రసవాల కోసం వచ్చిన క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోపాటు సకాలంలో వైద్యం అందకపోవడం, వైద్యుల కొరత కారణంగా మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ పరిస్థితిని అధిగమించించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక వైద్యులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో క్రమంగా మాతాశిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టేందుకు దోహదపడింది.
అనుబంధంగా మెడికల్ కళాశాల
మరోవైపు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులను నియమించి వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. గడిచిన 2023 నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు 242 శిశు, 24 మాతా మరణాలు చోటు చేసుకున్నాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతోపాటు అన్ని విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపర్చింది. గద్వాల, ధరూర్, గట్టు, అలంపూర్, అయిజ, మానవపాడు తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు సాధిస్తుంది.
అత్యవసర సమయాల్లో జిల్లా ఆస్పత్రికి రెఫర్
వాట్సప్ గ్రూప్‌లలో కేసుల వివరాలు
మెరుగుపడిన వైద్య సదుపాయాలు,
అందుబాటులో వైద్యులు, సిబ్బంది
సత్ఫలితాలిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు
తగ్గుముఖం


