భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం

Apr 6 2025 12:51 AM | Updated on Apr 6 2025 12:51 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం

ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

నేడు సీతారాముల కల్యాణోత్సవం..

శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌ రాజు తెలిపారు. భక్తులు రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

వక్ఫ్‌ సవరణతో

పేద ముస్లింలకు మేలు

గద్వాలటౌన్‌: వక్ఫ్‌ సవరణ బిల్లుతో పేద ముస్లింలకు ఎంతో మేలు చేకూరుతుందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాషా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వక్ఫ్‌ బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. వెనుకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. సమావవేశంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రవికుమార్‌, మాలీం ఇసాక్‌, మోహిద్‌ ఖాన్‌, ఆసిఫ్‌, అతాఉర్‌ రహమాన్‌, దేవదాసు, నర్సింహ తదితరులు ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో  లక్ష్మీహయగ్రీవ హోమం  
1
1/1

భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement