
అనుమానిత వ్యక్తుల సమాచారం అందించాలి
గద్వాల క్రైం: గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ శ్రీను సూచించారు. గురువారం సాయంత్రం గద్వాల పట్టణంలోని బీసీ కాలనీ, తెలుగు పేట, శివాలయం, రవీంద్ర పాఠశాల కాలనీలో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్‌తో పాటు సిబ్బంది కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ఘటనలు జరగకుండా ముందుస్తుగా ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కాలనీలో ఎవరికై న ఇళ్లు అద్దెకు ఇచ్చే క్రమంలో వారి వ్యక్తిగత సమాచారం, శాశ్వాత చిరునామా, ఆధార్ కార్డు తదితర వివరాలు సేకరించాలని, అలాగే ఎవరైన శుభకార్యాలు, దూర ప్రయాణాలకు వెళ్లే క్రమంలో దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు. అనంతరం కాలనీలోని పలు ఇళ్లలోని వ్యక్తుల సమాచారం ఆరా తీశారు. సీసీ కెమెరాలను కాలనీలో ఏర్పాటు చేసుకోవాలని, అత్యవసర సమయంలో డయల్ 100కు సంప్రదించాలన్నారు. 160 వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఎవరైన క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.