
పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
అయిజ: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతరులను ఎవరినీ కేంద్రాల వద్దకు రానివ్వకూడదని, పరీక్ష సమయం ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లు, ఇంటర్‌నెట్ సెంటర్లను మూసివేయించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఉత్తనూరులోని జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఏ విద్యార్థి, సెంటర్ సిబ్బంది సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆయన సందరించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరును ఎస్సై శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఒక్క ఉద్యోగి నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని న్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వై. మోగిలయ్య, శాంతినగర్ సీఐ టాటా బాబు తదితరులు ఉన్నారు.