పేట్రేగిపోతున్నారు..! | - | Sakshi
Sakshi News home page

పేట్రేగిపోతున్నారు..!

Mar 24 2025 2:09 AM | Updated on Mar 24 2025 2:09 AM

పేట్ర

పేట్రేగిపోతున్నారు..!

మద్యం మత్తులో

విచక్షణా రహితంగా దాడులు

నడిగడ్డలో వరుస ఘటనలతో

ప్రజల బెంబేలు

రాజకీయ జోక్యంతో

తలలు పట్టుకుంటున్న అధికారులు

గద్వాల క్రైం: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో కర్రలు.. గాజు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఓ ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ కిందపడి మృతి చెందింది. కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ప్రజలు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు.

జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు..

● ఈ నెల 6వ తేదీన గద్వాల మండలం కుర్వపల్లికి చెందిన ఓ మహిళ.. అదే గ్రామానికి చెందిన తాపీ మేసీ్త్రలతో ఇంటి నిర్మాణ పనులు చేయించింది. అయితే పనులు చేయడంలో జాప్యం చేయడంతో మరొకరితో పనులు చేయించింది. దీంతో ఇద్దరు తాపీమేసీ్త్రలు మద్యం మత్తులో సదరు మహిళ ఇంటి వద్దకు వచ్చి వాదనకు దిగారు. గమనించిన ఓ మహిళ సర్ది చెప్పేందుకు వెళ్లిన క్రమంలో ఆమెను తోసివేశారు. దీంతో కిందపడిన సదరు మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

– ఈ నెల 8వ తేదిన గద్వాల పట్టణానికి చెందిన ఓ పార్టీకి చెందిన నాయకులు మద్యం పార్టీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో మల్దకల్‌ మండలానికి చెందిన ఓ నాయకుడు తెలిసిన వ్యక్తికి ఫోన్‌ చేసి మాట్లాడుతున్న క్రమంలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కలత చెందిన ఓ నాయకుడు మరో వర్గానికి చెందిన వ్యక్తులను బీరోలు రోడ్డు మార్గంలోకి రప్పించుకుని దాడి చేశారు. బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

– ఈ నెల 11వ తేదీన గంజిపెటకు చెందిన ఓ యువకుడిని తమ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడి చేశాడని పాతకక్ష ఉంచుకొని బజాజ్‌ షోరూం సమీపంలో మద్యం మత్తులో దారి కాచి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి తలకు 16 కుట్లు పడ్డాయి. దాడి చేసిన వారిపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

● ఈ నెల 14న గద్వాల పట్టణానికి చెందిన యవకులు హోలీ పండుగ నేపథ్యంలో రంగులు చల్లుకున్నారు. అనంతరం కృష్ణానది సమీపంలో వడ్లవీధి, బీసీ కాలనీకి చెందిన యువకులు మద్యం తాగుతున్నారు. అయితే గుర్తు తెలియని యువకుడు మద్యం ఇవ్వాలంటూ వారితో అకారణంగా వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో యువకులు మద్యం మత్తులో ఉండడంతో రెండు వర్గాలకు చెందిన యువకులు ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే ఓ యువకుడిపై గాజు సీసాలతో దాడి చేయగా కుడి కన్ను కింద భాగంలో 9 కుట్లు పడ్డాయి.

● ఈ నెల 18న గద్వాల మండలంలోని చేనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. వృద్దులపై దాడి చేసిన క్రమంలో గాజు సీసాలతోనే దాడులు చేసినట్లు స్థానికులు గుర్తించారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

దాడులు చేస్తే సహించం

ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనలను ఎంత మాత్రం సహించేది లేదు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపాం. పెట్రోలింగ్‌, గస్తీ ముమ్మరం చేశాం. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం నమోదైన కేసుల తీవ్రత ఆధారంగా, దాడులకు పాల్పడిన వ్యక్తులపై రౌడీషీట్‌ నమోదు చేస్తాం. రాజకీయ జోక్యంతో మాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం అవాస్తవం. ఇప్పటికే దాడి కేసుల్లో నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించాం. త్వరలో మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తాం.

– మొగిలయ్య డీఎస్పీ, గద్వాల

రాజకీయ జోక్యంతో చర్యలకు వెనకడుగు

నడిగడ్డలో వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుందామంటే కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం, రాజీ కుదుర్చుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో కృష్ణానది సమీపంలో దాడికి పాల్పడిన ఘటన విషయానికి వస్తే.. దాడిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన క్రమంలో రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కట్టడి చేసే క్రమంలో వారిని సైతం పెడచెవిన పెట్టడంతో చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఫోన్‌ కాల్‌ నేపథ్యంలో చోటుచేసుకున్న దాడి, కృష్ణానది వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు అడుగులు వేయగా.. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రాగా కేసులతో పోలీసులు మౌనం దాల్చారు. అయితే ఈ ఘర్షణలు మూడు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల మధ్య చోటు చేసుకోవడం.. ఎవరిపై చర్యలు తీసుకుందామన్న రాజకీయ నేతాల ఒత్తిళ్లతో పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

పేట్రేగిపోతున్నారు..! 1
1/2

పేట్రేగిపోతున్నారు..!

పేట్రేగిపోతున్నారు..! 2
2/2

పేట్రేగిపోతున్నారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement