కాల్వలకు నీరు పారించి పంటలను కాపాడతామని ఇటీవల అధికారులు చెప్పినా.. అది అమలుకు నోచుకోకపోవడంపై బీజేపీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి పంటలకు సాగునీరు అందక దాదాపు 5 వేల ఎకరాల్లో వరి పంట వాడుముఖం పట్టింది. మూడు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా సైతం చేపట్టారు. వారబందీ పద్ధతిలో నీరు అందిస్తామని అధికారులు చెప్పినా.. నేటికీ కాల్వకు నీరు పారలేదు. దీంతో బుధవారం కేటీదొడ్డి మండలం కొండాపురం శివారులో 104 ప్యాకేజీ కాల్వలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఇప్పటికై నా నీరు అందించి పంటను కాపాడాలని డిమాండ్ చేశారు.
– కేటీదొడ్డి